భారీగా పెరిగిన పసిడి ధరలు
పసిడి ధరల్లో ఈ మధ్య అటుఇటుగా మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సహజంగా బంగారం అంటేనే మహిళలు పడిచస్తారు. అదే విషయాన్ని క్యాష్ చేసుకొని మార్కెట్ లో కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. అసలు పసిడి విషయంలో ఎంత రేటు ఉన్నప్పటికీ బంగారం కొనేందుకు మహిళలు ఆలోచించరు. ఇక మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైకి ఎగబాకడంతో.. బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ. 46,900 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 43,000 కు చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 71,300 వద్ద కొనసాగుతోంది. తాజాగా వరుసగా కాస్త తగ్గుతోందనుకున్న సమయంలో పెరగడం మళ్లీ పసిడి ప్రియులను నిరాశ మిగల్చడం వంటిదే.