భారీగా పెరిగిన పసిడి ధరలు
దేశంలో పసిడికి ఇచ్చే గౌరవం, కొనే ఆచారంపై ఎంత చెప్పినా తక్కువే. అది అలవాటుగా భావించి దేశ ప్రజలు బంగారానికి ఇచ్చే విలువ చెప్పడానికి సాధ్యం కాదు. దీంతో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా గత మూడు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధర… ఈరోజు మాత్రం కాస్త పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందికి దిగడంతో… బులియన్ మార్కెట్లో కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగి రూ. 48,330 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 44,300కు చేరింది. కాగా ఈ రోజు బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 73,300 వద్ద కొనసాగడం విశేషం