భారత్ కి అప్పగిస్తే ఆత్మహత్యే : నీరవ్ మోడీ…

బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని చివరకు లండన్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా నీరవ్ మోడీని భారత్కు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ.. ఈ వ్యవహారంపై లండన్ కోర్టులో అప్పీల్కు వెళ్లిన నీరవ్ మోడీ సంచలన రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు.

తాజాగా నీరవ్ మోడీ ఏమన్నారు అంటే… తనను భారత్కు అప్పగించ వద్దని కోర్టుకు తెలిపారు నీరవ్ మోడీ. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత తనను భారత్కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమని కూడా కోర్టుకు ఓ రకంగా హెచ్చరికలు జారీ చేశాడు. కాగా కొద్ది రోజుల క్రితం నీరవ్కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్కు కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఇండియాకు అప్పగించే మార్గానికి లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి. బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడి పారిపోయిన నీరవ్ మోడీ.. దేశంలోని ఆర్థిక నేరాల్లో నిందితుడుగా ఉన్నాడు. ఆయన్ను భారత్కు అప్పగించాలని లండన్లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. ఇండియాలో మనీల్యాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోడీ..ఇలాంటి సంచలనం రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *