భగ్గుమంటోన్న పెట్రోల్, డీజిల్ ధరలు….
ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరసుగా పెరుగుతుండటం సామాన్యుడి నడ్డి విరుస్తుంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరల్ కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటాయి. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. ఆ తర్వాత నుంచి వరుసగా పెట్రోల్ ధరలు పెరగడం ఆగిపోయాయి. అయితే ఆయా రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచే… పెట్రోల్ ధరలు పెరగడం ఆరంభమైంది.
తాజాగా చమురు ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, లీటర్ డీజిల్ పై 34 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.34 కు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 82.95 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.97 కు చేరగా.. డీజిల్ ధర రూ.90.43కు చేరింది. కాగా ముంబైలో పెట్రోల్ ధర రూ. 98.65 కు చేరగా.. డీజిల్ ధర రూ. 90.11కు చేరడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు.