బెంగుళూరు డ్రగ్స్ ఉచ్చులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు

https://www.banyanheartland.com/2019/11/12/infections-iv-drug-users-can-get/

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. బెంగళూరు కేంద్రంగా సాగుతోన్న డ్రగ్స్ కేసులో తాజాగా కొత్త విషయాలు వెలుగు చూశాయి. కొన్ని రోజుల క్రితం నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే వారిని విచారించగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే బెంగళూరు నగరంలో పబ్ లు, హోటళ్లను హైదరాబాద్ వ్యాపారవేత్తలు సందీప్, కలహర్ రెడ్డిలకు, కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడ్ కు డ్రగ్స్ సప్లై చేసినట్టు నైజీరియన్లు వెల్లడించినట్లు పోలీసులు ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే సందీప్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అనేక సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కలహార్ రెడ్డి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు పార్టీలు ఇచ్చేవారని సందీప్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీల్లో పాల్గొన్నారని, నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నారని కూడా సందీప్ చెప్పినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఓ తెలంగాణ ఎమ్మెల్యే కోరడంతో అనేకసార్లు కొకైన్ పంపినట్లు సందీప్ పోలీసులకు వివరించారు. కాగా కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్ తో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కూడా బెంగళూరు పోలీసులు త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం అందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *