బీజేపీపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ ఆరోపణలు, విమర్శలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ పొత్తులో ఎన్నికల బరిలోకి దిగిన అధికార అన్నాడీఎంకే నేతలు.. ప్రతిపక్ష డీఎంకేను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో డీఎంకే మాత్రం, అన్నాడీఎంకేతో పాటు.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై తాజాగా హాట్ కామెంట్స్ చేశారుయ ఈరోజు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవేమంటే… బీజేపీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలవడం లేదని తీవ్రమైన ఆరోపనలు గుప్పించిన ఆయన.. చాలాచోట్ల ఉన్న ప్రభుత్వాలను కూల్చి.. బీజేపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అంతేకాకుండా పార్లమెంటులో మెజారిటీ ఉండటంతో.. బీజేపీ.. అందరిని బెదిరించి.. బీసీఐ, ఎన్నికల సంఘం, ఐటీ, సుప్రీంకోర్టు తమ చేతుల్లో పెట్టుకుని.. ప్రభుత్వాలను నడుపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ మొదట్లో ఉండేదని.. కానీ, రానురాను అది తగ్గి పోతుందని. అందుకు వారు అనుసరిస్తున్న విధానాలే కారణమని అన్నారు. కాగా సుప్రీంకోర్టుపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు చెన్నైకి చెందినా ఓ న్యాయవాది. మరి ఈ విషయంపై ఏం జరుగుతుంది అనేది చూడాలి.