బిల్ గేట్స్ ఫౌండేషన్ కు వారెన్ బఫెట్ రాజీనామా….

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కు చెందిన మిలిందా గేట్స్ ఫౌండేషన్కు వారెన్ బఫెట్ రాజీనామా చేశారు. బిల్గేట్స్, మిలిందా గేట్స్లు 27 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ.. విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాను ఇప్పుడు ఈ ఫౌండేషన్లో కొనసాగకూడదని బఫెట్ నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే రాజీనామా చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది. అయితే తాను ట్రస్టీలో ఉన్నప్పటీకి.. క్రియాశీలంగా లేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బఫెట్ తెలిపారు.
అదేవిధంగా తన బర్క్షైర్ హాత్వే షేర్లను సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే లక్ష్యం సగానికిపైగా పూర్తయిందని వెల్లడించారు. అలాగే ముగ్గురు సభ్యులున్న బోర్డులో బఫెట్ కూడా ఒకరు. కాగా 15 ఏళ్లలో ఈ ట్రస్ట్ ద్వారా 27 బిలియన్ డాలర్లను సేవా కార్యక్రమాల కోసం వినియోగించడం వేశేషం. ఇప్పటి వరకు బఫెట్ ఐదు సేవా సంస్థలకు 41 బిలియన్ డాలర్లను విరాళంగా అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *