బిన్ లాడెన్ సోదరుడి బంగ్లా అమ్మేందుకు రెడీ…!
ప్రపంచాన్నే గడగడలాండించన ఉగ్రవాది ఒసామా బీన్ లాడెన్. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ ను కూల్చివేతలో కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాక్లో తలదాచుకున్న సమయంలో ఆయన్ను అమెరికా సైన్యం హతమార్చింది. అలాగే లాడెన్ సోదరుడు ఇబ్రహీమ్ కు లాస్ ఎంజెల్స్ లో ఓ విలాసవంతమైన భవంతి ఉంది.
అయితే 2001 దుర్ఘటనకు ముందు వరకు ఆ ఇంట్లో ఇబ్రహీమ్ లాడెన్ కుటుంబ సభ్యులు ఉండేవారు. ఎప్పుడైతే 2001లో ట్విన్ టవర్స్ కూల్చివేత జరిగిందో ఆ తర్వాత ఆ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసేసింది. అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. 20 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఇంటిని ఇప్పుడు ఆమ్మకానికి పెట్టారు లాడెన్ కుటుంబ సభ్యలు. రెండు ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో విస్తరించిన భవంతిని 28 మిలియన్ డాలర్లకు అమ్మాకానికి రెడీ చేశారు. కాగా 1931లో నిర్మించిన ఈ భవంతిని ఇబ్రహీం రెండు మిలినియన్ డాలర్లకు 1983లో కొనుగోలు చేశారు. అప్పట్లో ఒసామాబీన్ లాడెన్ కూడా ఆ భవంతిలో కొన్నాళ్లు నివశించారని టాక్.