బిగ్ బాస్ సీజన్ 5 న్యూ అప్డేట్….!
బుల్లితెర సంచలనం బిగ్ బాస్ సీజన్ 5కు రంగం సిద్ధమైంది. గత నాలుగు సీజన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 5కు రెడీ అయింది. వీక్షకులు కూడా ఎప్పుడు వస్తుందా అంటూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీయార్ తో మొదలైన ఈ బిగ్ బాస్ షో.. ఆ తర్వాత నాని, నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు అనడంతో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఐదో సీజన్ కు రానా పేరు మొదటి వినిపించినా.. తాను ‘బిగ్ బాస్’ షో చేయడం లేదని స్పష్టం చేశారు. మరి ముచ్చటగా మూడోసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ షో ను నిర్వహిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. మరి చివరి క్షణంలో మార్పులు చేర్పులు జరిగితే చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి మాత్రం నాగ్ కోర్టులోనే బంతి ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.
అదేవిధంగా…. లాస్ట్ సీజన్ లో పార్టిసిపెంట్స్ పై వీక్షకులు విపరీతంగా నిరుత్సాహాన్ని చవిచూసినట్లు నిర్వాహకులకు అర్థమైంది. దీంతో ఇప్పుడు కాస్త గుర్తింపు ఉన్నవాళ్ళను, క్రేజ్ ఉన్న వారిని బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అందులో భాగంగా భారీ పారితోషికం ఇచ్చిన అయినా సరే కాస్త పేరున్న వారినే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లాస్ట్ సీజన్ వలె ఎలిమినేషన్స్ విషయంలో లీకులు జరగకుండా మరింత గోప్యతను పాటించేలా జాగ్రత్తలు కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన మరో విషయం ఏమిటంటే.. ఈ సీజన్ సెప్టెంబర్ 5 నుండి స్టార్ట్ కానున్నట్లు సమచారం. చూద్దాం మరి ఈ సారి ఎలాంటి ట్విస్ట్ లతో బిగ్ బాస్ షోను రక్తి కట్టిస్తారో..