బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ కు కరోనా
కరోనా దేశంలో చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. రోజుకు లక్షకు పైగా కేసులు నమోదౌతున్నాయి. ప్రముఖులను కరోనా విడిచిపెట్టడం లేదంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటి అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది.
ముఖ్యంగా ఓ పక్క కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ కేసులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు సరికదా విపరీతంగా పెరుగుతున్నాయి. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అయితే… తాజాగా దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయోంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొనడం విశేషం. ఆయన ఏమన్నారు అంటే… ‘నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నా స్నేహితులు వృత్తిపరమైన భాగస్వాములు.. దయచేసి రెండు వారాలు ఫోనులు చేయవద్దు. త్వరలోనే నేను కోలుకుంటాను’ అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. కాగా టాలీవుడ్లో ఇప్పటికే అల్లు అరవింద్, వకీల్సాబ్ హీరోయిన్ నివేదా థామస్కు కరోనా సోకిన విషయం తెలిసిందే.