బాలీవుడ్ బాటలో వరుణ్ తేజ్…

మెగా కుటుంబం నుంచి వచ్చిన యంగ్ హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ సినిమాతో పాటు వెంకటేశ్ తో కలిసి ‘ఎఫ్ 3’ మూవీలో కూడా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలు కాస్తంత ముందు వెనుకగా ఈ సంవత్సరమే విడుదల అవుతాయని తెలుస్తోంది. దీని తర్వాత వరుణ్ తేజ్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే అతి త్వరలోనే వరుణ్ తేజ్ హిందీలో ఓ సినిమాలో నటిస్తాడని టాక్ నడుస్తోంది. అదేమంటే… కొత్త దర్శకుడు చెప్పిన కథకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రస్తుతం అడివి శేష్ తో ‘మేజర్’ మూవీని నిర్మిస్తున్న సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతోందని సమాచారం. అలాగే కేవలం హిందీలోనే ఈ సినిమా రాబోతుందని కొందరంటే.. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి, ఆ తర్వాత ఇతర దక్షిణాది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మెగా ఫ్యామిలీ యంగ్ హీరో బాలీవుడ్ బాట పట్టడం మాత్రం ఖాయమనే గుసగుసలు ఫిల్మ్ నగర్ టాక్ నడుస్తోంది. చూద్దాం ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *