బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి కరోనా

కోవిడ్-19 సెకండ్ వేవ్ గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో విజృంభిస్తోంది. ప్రభుత్వం ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ మరో వైపు రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
అయితే ఇప్పటికే దేశంలో ఎందరో ప్రముఖులు కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్గా నిర్దరణ అయింది. సంజయ్ బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుత సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా అతడు రూపొందిస్తున్న సినిమా గంగూబాయ్ కతియావాడి. ఈ సినిమాలో అలియా భట్ టైటిల్ రోల్ లో నటిస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ పాల్గొంటున్నారు. ఇప్పుడు సినిమా దర్శకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం సంజలీలా భన్సాలీ క్వారంటైన్లో ఉన్నారు. కాగా ఈ రోజే బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బాలీవుడ్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీకి కరోనా అని తేలడంతో గంగూబాయ్ కతియావాడి టీమ్ అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.