బాలయ్య సినిమాకు నో చెప్పిన శ్రుతి
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోలతో వరుసబెట్టి సినిమాలు చేసుకుబోతున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా పెట్టలేదు.
అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చాలా కాలం పాటు తర్జనభర్జనలు పడ్డారు. ఎట్టకేలకు కంచె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య తర్వాతి సినిమా గోపీచంద్ మలినేనితో చేయనున్నారు. గోపీచంద్ ఈ ఏడాది క్రాక్ మూవీతో స్టార్ డమ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గోపీచంద్ కూడా బాలయ్యకు సరిపడే హీరోయిన్ కోసం తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే… గోపీచంద్ క్రాక్ మూవీ హీరోయిన్ శ్రుతిహాసన్ను బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం కలిసినట్లు తెలుస్తోంది. కానీ బాలయ్యతో సినిమా చేసేందుకు శ్రుతి అంతగా పాజిటివ్ గా స్పందించలేదని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజమనే విషయం బయటకు రావడం లేదు కానీ, క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకోవడం విసేషం. కాగా ప్రస్తుతం శ్రుతి హాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతుండటం విశేషం.