బాబు పై సీఐడీ యాక్షన్ పై సోము వీర్రాజు రియాక్షన్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంది. అమరావతి భూముల అక్రమాలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 41వ సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. 23వ తేదీ విచారణకు హాజరు కావాలని కోరారు.
అయితే.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం దురుద్దేశ పూర్వకంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని తీవ్ర ఆరోపనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇది ఇలా ఉండగా జరుగుతున్న పరిణామాలపై వెరైటీగా స్పందించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఐడీ నోటీసులను టీడీపీ నేతలు కక్ష సాధింపు అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో మాపై టీడీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడలేదా? అని ప్రశ్నించారు. ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు బ్లాక్ బెలూన్స్, ప్లకార్డులు ప్రదర్శించారు, కేంద్ర మంత్రి అమిత్షా.. తిరుపతి పర్యటనలో రాళ్లదాడి చేసిన పలు ఘటనలను గుర్తు చేసుకొంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.