బక్వాస్ మాటలు ఆపు బాబు: సాయిరెడ్డి పంచ్

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి టిడిపిది అని.. బక్వాస్ మాటలతో నవ్వులపాలు కావొద్దు అని చంద్రబాబుకు చురకలు అంటించారు. అసలు ఆయన ట్విట్టర్ వేదికగా ఏమన్నారు అంటే… ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తన పార్టీ గెలుస్తుందట. సంక్షేమం అమలులో విఫలమైనందువల్ల ప్రజలు జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారట! ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి నీది. డిపాజిట్ దక్కితే చాలనుకున్న సంగతి ప్రజలింకా మర్చిపోలేదు. బక్వాస్ మాటలతో నవ్వులుపాలు కావొద్దు చంద్రం. స్వీయ ఆరాధన ఏ స్థాయికి చేరిందంటే 5 కోట్ల మంది ప్రజలు తనను తిరస్కరించి సరిదిద్దుకోలేని తప్పు చేశారని భ్రమపడుతున్నాడు. వాళ్లకు ఇంత చైతన్యం ఎలా వచ్చిందని విస్మయం చెందుతున్నాడు బాబు. రెండేళ్ల తర్వాత కూడా అలాగే ఆలోచిస్తున్నాడంటే మెంటల్ కండిషన్ అనుమానించాల్సిందే’ అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అంతేకాకుండా ఇంకా ఆయన ఏమన్నరంటే.. ‘సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020-21 ఏడాదికిగానూ రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ ర్యాంక్లు విడుదల చేసింది. పలు అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ఏపీ.. టాప్-5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 72 పాయింట్లతో మూడోస్థానం దక్కించుకుంది. క్లీన్ ఎనర్జీ విభాగంలో టాప్ ర్యాంక్ సాధించింది.’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ తో చెలరేగిపోయారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా బాబుపై భలే పంచులతో పేల్చేస్తున్నారు అంటూ వైసీపీ అభిమానులు మురిసిపోతున్నారు.