ప్రొడ్యూసర్ గా అలియా.. షారుక్ తో….

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. అయితే ఈ సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర’, ‘గంగూభాయ్ ఖతియావాడి’ సినిమాల్లో నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారుతుందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే… ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం అలియా ప్రిపరేషన్ మొదలు పెట్టేసింది. ‘డార్లింగ్స్’ పేరుతో నిర్మించేందుకు రెడీ కాతున్న ఈ సినిమాకు షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ కూడా భాగస్వామిగా ఉండబోతోంది. తొలియత్నంలో చేదు అనుభవాలు ఏమీ ఎదురు కాకుండా ఉండటం కోసం అలియా సీనియర్ గా సినిమాలు చేసే ప్రొడక్షన్ హౌస్ తో చేతులు కలిపడం విశేషంగా చెప్పవచ్చు.
అంతేకాకుండా ముంబైకి చెందిన దిగువ మధ్యతరగతిలోని తల్లీ కూతుళ్ళ కథగా ‘డార్లింగ్స్’ రూపుదిద్దుకోబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే రచయిత్రిగా చక్కని గుర్తింపు పొందిన జస్మిత్ కె రీన్ ఈ మూవీని తొలిసారి డైరెక్ట్ చేస్తోంది. ఇందులో ‘సత్య’ ఫేమ్ షఫాలీ షాతో పాటు విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించనున్నారు. గతంలోనూ షారుక్ ఖాన్ తో కలిసి నటి జుహీ చావ్లా కొన్ని సినిమాలు నిర్మించింది. ఆ రకంగా చూసినప్పుడు షారుక్ లో నమ్మకస్తుడైన స్నేహితుడే వీళ్లకు కనిపించాడు. ఇదిలా ఉండగా.. ఈరోజు వరల్డ్ యోగా డే సందర్భంగా అలియా భట్ యోగాసనాలు వేస్తున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఎంతో అద్భుతంగా అమ్మడు వేసిన యోగాసనాలు చూసి, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *