ప్రియుడితో ఫ్లైట్ లో చెక్కేసిన నయనతార

దక్షణాది దివ్యసుందరి, సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ వీళ్లిద్దరు గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యనే నయన్, విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా అయిందని పలువురు భావిస్తున్నారు.
అయితే నయన్ చేతికి రింగు ఉన్న ఫోటో షేర్ చేయగా… ఆ ఫొటోను చూసిన పలువురు నెటిజన్లు కంగ్రాట్స్ కూడా తెలియజేశారు. పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యోన్యంగా ఉంటూ హల్చల్ చేస్తుంది ఈ జంట. ఇది ఇలా ఉండగా తాజాగా నయనతార బాయ్ఫ్రెండ్తో కలిసి ఫ్లైటెక్కింది. ఎయిర్ పోర్ట్లో జంటగా కనిపించి అభిమానులను కనువిందు చేసింది. ఈ నెల 14న కేరళలో విషు పండగ సందర్భంగా నయన్-శివన్ ఓ ప్రైవేటు విమానంలో కోచికి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *