ప్రభాస్ రాధేశ్యామ్ కు భారీ ఆఫర్….

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా రాధేశ్యామ్. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ పాటతో పాటు సీనియర్ నటుడు కృష్ణంరాజుకు సంబంధించిన ఓ ఎపిసోడ్, అలానే కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయింది.
అదేవిధంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా యూనిట్ తిరిగి కరోనా వేవ్ తగ్గుతుండటంతో షూటింగ్ కు వెళ్లేందుకు రెడీ కాబోతుంది. ఇదిలా ఉండగా… ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన టీసీరిస్ కు ఓ ప్రముఖ ఓటీటీ కంపెనీ భారీ ఆఫర్ ను ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. కాగా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్నరాధేశ్యామ్ కు దాదాపు రూ. 330 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఏకంగా ఈ సినిమాను రూ. 400 కోట్లకు సర్వహక్కులు ఇవ్వమని నిర్మాణ సంస్థను కోరుతున్నట్లు సమాచారం అందుతుంది. మరి అందుకు యూవీ క్రియేషన్స్ అధినేతలు, టీ సీరిస్ వర్గాలు ఈ ఆఫర్ పై తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఏరియా వైజ్ బిజినెస్ చేసి విడుదల చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమెజాన్ తో డీల్ కుదిరితే ప్రభాస్ నటిస్తున్న మిగిలిన పాన్ ఇండియా సినిమాలు, ఆ వాటి వ్యాపారాలపైన కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *