ప్రభాస్ తో రమ్యకృష్ణ ఓ పవర్ ఫుల్ రోల్
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తన అందచందాలతో కుర్రకారుని మతి పోగొట్టిన నటీమణి రమ్యకృష్ణ. అయితే ఇప్పుడు చాలా వైవిధ్యభరితమైన, విలక్షణమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
అయితే ప్రస్తుతం రమ్యకృష్మ తెలుగులో ‘లైగర్’, ‘రిపబ్లిక్’ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ వంటి భారీ చిత్రంతో తన కెరీర్లో రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించింది రమ్యకృష్ణ. ఆ తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మరింతగా మెప్పించింది.
అదేవిధంగా తాజాగా ఆమె మరోసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు గాను రమ్యకృష్ణ నటించనుందని టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చ సాగుతుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్ కు అక్కగా నటించనున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. మరి ప్రభాస్ కు అక్క పాత్రలో రమ్యకృష్ణ ఎంత రమ్యంగా ఆకట్టుకోనుందో చూడాలి.