ప్రభాస్ కోసం హైదరాబాద్ కి అమితాబ్…

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక హైదరాబాద్లో జరగనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఎటువంటి వివరాలు చెప్పకుండానే అమితాబ్ ట్వీట్ లో ఈ విషయాన్ని పంచుకోవడం విశేషం.

అదేవిధంగా “రేపు మొదటి రోజు ముహూర్తం… కొత్త చిత్రం కొత్త ప్రారంభం, కొత్త వాతావరణం…” అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ కోసం అమితాబ్ 6-7 రోజులు షూటింగ్ చేసి తర్వాత ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. కాగా ఈరోజు సినిమా ప్రారంభం కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న ఒకే ఒక భారీ తెలుగు మూవీ ఇదే కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రభాస్ ఈ సినిమాలో ఎలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *