పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ… అందుకేనట..
టాలీవుడ్ లో జానపద పాటలను పాడుతూ అంచలంచలుగా ఎదుగుతున్న సింగర్ మధుప్రియ. అయితే సింగర్ మధు ప్రియకు ఇప్పుడు ఒక కష్టం వచ్చి పడింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్-1 కంటెస్టెంట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది మధుప్రియ. ‘ఆడపిల్లనమ్మా’ అనే పాటతో చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సింగర్ మధుప్రియ. ఆ తర్వాత ఎన్నో పాటలు పాడి తమకంటే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది మధుప్రియ.
అయితే తాజాగా మధుప్రియ పోలీసులను ఆశ్రయించారు. తనకు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ కారణంగా మధుప్రియ హైదరాబాద్ షీ టీమ్స్ కు మెయిల్ లో ఈ ఫిర్యాదు చేశారు. అయితే షీ టీమ్స్ మెయిల్ ను సైబర్ కు బదిలీ చేశారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో మధుప్రియ పేర్కొన్నారు. తనకు వచ్చిన బ్లాంక్ ఫోన్ కాల్స్ వివరాలను సైబర్ క్రైమ్ కు అందజేసింది. మధుప్రియ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 509, 354b సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారని సమాచారం అందుతుంది.