పెళ్లికి రెడీ అయిన నయన్- విఘ్నేష్ జంట…!

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చాలాకాలం నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కానీ తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం అందుతుంది.
అదేవిధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో తరచుగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు విగ్నేష్. అందులో భాగంగా తాజాగా ఫ్యాన్స్ అడిగే పలు ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్తున్నాడు. దీంతో చాట్ సెషన్ లో పాల్గొన్న నెటిజన్లు ఆయనను పెళ్ళి గురించి ప్రశ్నించారు. అందుకు సమాధానంగా విగ్నేష్.. వివాహం ఖరీదైనదని, ఆ శుభ కార్యక్రమానికి డబ్బు ఆదా చేస్తున్నాను అని చెప్పాడు. అలాగే కోవిడ్ -19 మహమ్మారి పూర్తిగా తగ్గిన తర్వాత ఈ లవ్ బర్డ్స్ వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నయనతార జీవితం తెరిచిన పుస్తకం. ఆమె రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలుసిందే. కానీ నయన్ మాత్రం ఎప్పుడూ వారి రిలేషన్ పై స్పందించలేదు. అయితే నయన్.. దర్శకుడు విఘ్నేష్ శివన్ను ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా షూటింగ్లో కలిశారు. ఆ తర్వాత వారి బంధం ప్రేమగా మారింది. అది ఇప్పుడు పెళ్ళిగా మారింది. మరి ఈ జంట ఒక్కటి ఎప్పుడు అవుతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *