పూజా భట్ తొలిముద్దు పై హాట్ కామెంట్స్
బాలీవుడ్ హాట్ బ్యూటీ మహేశ్ భట్ కూతురు పూజా భట్ తాజాగా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. వెండి తెరపై తన తొలి ముద్దు గురించి మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకుంది. చాలా ఏళ్ల క్రితం ‘సడఖ్’ సినిమా చేస్తున్నప్పుడు సంజయ్ దత్ ని ముద్దాడాల్సి వచ్చిందని.. ఆ సమయంలో సంజయ్ ఆమె అభిమాన హీరో కావడంతో కాస్త తర్జన భర్జన పడ్డానని తెలిపింది.అయితే అప్పుడు తన వయస్సు కేవలం 18 ఏళ్లని, ఆ టీనేజ్ లో తన ఫేవరెట్ హీరోని కిస్ చేస్తున్నప్పుడు వల్గర్ గా ఉండకూడదని మహేశ్ భట్ కూతురికి సలహా ఇచ్చాడని కూడా తెలిపింది.
అదేవిధంగా హీరోని పూజా ముద్దాడుతున్నప్పుడు అమాయకత్వం, గాంభీర్యం కలగలిసిన ఓ రొమాన్స్ పండించాలని మహేష్ భట్ సూచించినట్లుగా వెల్లడించారు. కాగా నెట్ ఫ్లిక్స్ లో ‘బాంబే బేగమ్స్’ అనే షో చేస్తోంది ప్రస్తుతం పూజా భట్. ఆ కార్యక్రమం ప్రమోషన్ సందర్భంగా తన తొలి ముద్దు ముచ్చట్లు గురించి చెప్పింది పూజా భట్.