పుష్ప తర్వాత విజయ దేవరకొండతో సుకుమార్..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను గత సంవత్సరమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఊహాగానాలు రావడంతో… ఆ తర్వాత మేకర్స్ అవన్నీ పుకార్లేనని స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పుష్ప తర్వాత సుకుమార్… విజయదేవరకొండతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐకాన్ స్టార్ తో చేస్తున్న ఈ సినిమా పూర్తి కాగానే.. విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నారంట సుకుమార్.
అదేవిధంగా ‘పుష్ప’ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం కూడా తెలిసిందే. మరి ‘పుష్ప’ తొలి భాగాన్ని పూర్తి చేసిన తర్వాత సుకుమార్, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అనేది తాజా సమాచారం. అలాగే ‘పుష్ప’ రెండవ భాగం స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతోంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యేందుకు కాస్త సమయం పట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా ‘పుష్ప’ తొలి భాగం పూర్తయ్యాక కొంచెం గ్యాప్ తీసుకుని రెండవ భాగాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అంటే ఆ గ్యాప్ టైంలో విజయ్ దేవరకొండ సినిమాని చేయనున్నారని సమాచారం. కాగా మరి ఈ మూవీని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్లో కేదార్ సెలగంసెట్టి నిర్మించనున్నారు.