పుష్ప తర్వాత ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇది అలా ఉంచితే తాజాగా పుష్ప యూనిట్ ‘పుష్ప ఫస్ట్మీట్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ చాలా ఎమోషనల్ మాట్లాడి అందరి గుండెలను పిండేశారు. ‘స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ బన్నీకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో బన్నీ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రమాణం చేసి చెబుతున్నా.. సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట అంటారు. ముఖ్యంగా సినిమాలో అర్జున్.. నటన చూసిన తర్వాత స్టైలీస్ అనే పదం ఒక్కటే ఆయనకు సరిపోదనిపించింది. నా అభిప్రాయం ప్రకారం.. బన్నీ ఒక స్టైలీస్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్ అనీ, తన కథల ఎంపిక ప్రత్యేకం.. వేసే డ్రెస్సులు ప్రత్యేకం.. బన్నీ డ్యాన్స్ ప్రత్యేకం.. అందుకే ఈ సినిమా తర్వాత బన్నీని ఐకాన్ స్టార్ లేదా పుష్ప అని పిలుస్తారు’ అంటూ సుకుమార్ ఎమోషన్ అయ్యాడు. మొత్తానికి సుకుమార్ మరోసారి మరో హీరో అయిన బన్నీని సానబెట్టి తీర్చిదిద్దుతున్నాడన్నమాట అనే విషయం ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *