పిక్ వైరల్…. కుమారుడితో పవర్ స్టార్….

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల కొడుకు అకిరా నందన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ పిక్ లో పవన్, అకిరా నందన్ లు కలిసి ఉండటమే అందులో విశేషం. అలాగే ఈ పిక్ లో అకీరా హైట్ చూసి అంతా షాకవుతున్నారు. అప్పుడే అకిరా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నాడు. ఇక అకీరా వెండితెర ఎంట్రీకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి.
అదేవిధంగా రేణూ దేశాయ్ కూడా అకీరా సినిమాల్లో నటిస్తానంటే తనకేం అభ్యంతరం లేదని ఇప్పటికే చెప్పేసింది. అలాగే ఈ మధ్య కరోనా నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ మూవీని పవన్ చేయాల్సి ఉంది. మొత్తానికి ఈ కాస్త విరామంలో పవన్ పిల్లలతో ముచ్చట తీర్చుకుంటున్నట్లుగా ఉంది ఆ పిక్ లో ఫోజ్ చూస్తుంటే… నిజమే అంటారా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *