పసిడి ప్రియులకు శుభవార్త: భారీగా తగ్గిన బంగారం….
దేశంలో పసిడి ధర గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అయితే.. తాజాగా అంటే నిన్న పసిడి ధర కాస్త తగ్గగా… ఈరోజు కూడా తగ్గింది.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో… బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గి రూ.45,700కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.41,900కు చేరుకుంది. కాగా ఈరోజు బంగారం ధరలు తగ్గగా… వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ. 70,400 కు చేరుకోవడం విశేషం.