పవర్ స్టార్ మూవీలో క్రేజీగా ఫోక్ సాంగ్…!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ రోల్ లో మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘అయ్యప్పనుమ్ కోషియం’ కి రీమేక్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తుండటం విశేషం. అయితే సాగర్ చంద్ర ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ అదిరిపోయే ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ ను రికార్డు చేయబోతున్నారని కూడా సమాచారం. కాగా ఈ ఫోక్ సాంగ్ ను ఎవరు పాడతారో తెలియడం లేదు. అయితే కరోనా కేసులు తగ్గుతున్న ఈ తరుణంలో సినిమా షూట్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. రానా ఇందులో క్రేజీ పాత్రలో మురిపించనున్నారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీర మల్లు’, హరీష్ శంకర్ సినిమాలతో చాలా పవన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యనే పవన్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.