పవర్ ఫుల్ రీమేక్ కోసం నిత్యామీనన్….!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బోలెడు క్రేజ్ ఉంటుంది. ఇక రానా కూడా కలిస్తే ఇంకేముంది చెప్పడానికి ఫ్యాన్స్ కి డబుల్ జోష్. అటువంటి ఫుల్ జోష్ లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో అప్ డేట్ మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంది. పవన్, రానా మల్టీ స్టారర్ మలయాళ రీమేక్ లో మల్లూ బ్యూటీ నిత్యా మీనన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ అధికార సోషల్ మీడియా అకౌంట్లో అఫీషియల్ గా ప్రకటించడం విశేషం. అయితే పవన్ పోలీస్ గా, రానా ఆర్మీ మ్యాన్ గా రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తోన్న సినిమాకి సాగర్ చంద్ర డైరెక్టర్ చేస్తుండటం కూడా మరో విశేషం.
అదేవిధంగా మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తోన్న పవన్, రానా మూవీకి మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ మూలం. అదే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులతో బిజీగా ఉన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ టీమ్ సంక్రాంతికి సినిమాని ప్రేక్షకుల ముందుకి తెచ్చే ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాకుండా పవన్, రానా స్టారర్ కి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ప్రొడక్షన్ నంబర్ 12గా వ్యవహరిస్తున్నారు. కాగా 2021 జనవరిలో… సంక్రాంతి వేళ… ఏ తేదీన మూవీ రిలీజ్ అవుతుందో కూడా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉందని అభిమానులు ఆతృతతో అడగలేక వేచి చూస్తున్నారు.