పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్… రామ్ చరణ్ ఫ్యాన్స్….

టాలీవుడ్ దిగ్దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాకు సంబంధించి ఏపాటి చిన్న అప్ డేట్ వచ్చినా ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అయితే ఈరోజు అదే జరిగింది. అదేమంటే… సినిమా అప్ డేట్స్ తో సరిపెట్టకుండా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన సూపర్ డూపర్ క్రేజీ పోస్టర్ నూ వదిలారు. దీంతో యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం భీమ్ గా బైక్ నడుపుతుంటే… ఆ వెనకే చిరునవ్వులు రువ్వుతూ కూర్చున్నాడు అల్లూరి సీతారామరాజు ఉరఫ్ రామ్ చరణ్. కేవలం రెండు పాటల మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని, ఎన్టీయార్, రామ్ చరణ్ రెండు భాషలలో డబ్బింగ్ కూడా పూర్తి చేశారని వెల్లడించారు. అలాగే మిగిలిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని కూడా తెలిపింది చిత్రబృందం.
అయితే ఇంతవరకు సరే. మరి పనిలో పనిగా మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తే బాగుండేదని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆ మిగిలి ఉన్న రెండు పాటలు, కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్కే కాబట్టి…. ముందు అనుకున్నట్టు అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆస్కారం లేకపోలేదని కూడా సమాచారం అందుతుంది. కాగా రాజమౌళి వర్కింగ్ స్టైల్ తెలిసిన వారు మాత్రం… ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను హడావుడిగా పూర్తి చేసి, జనం ముందు పెట్టడానికి ఆయన అంగీకరించరని కూడా ఓ పక్క టాక్ వినిపిస్తుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ పోస్టర్ ట్రెండింగ్ న్యూస్ ను ఆస్వాదిస్తూ, రిలీజ్ డేట్ ప్రకటన కోసం వేచి చూసేలే సంబరాలు అయితే గట్టిగానే జరుపుకుంటున్నారు.