పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో ఆర్య దంపతులు…
ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయేషా సైగల్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు. ఓ సినిమా సెట్లో కలుసుకున్న ఆర్య, సయేషా ప్రేమలో పడ్డారు. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా పెళ్లి తర్వాత సినిమాలు చేయలేదు. అలాగే ఆమె ప్రెగ్నెన్సీ విషయం కూడా రహస్యంగా ఉంచారు. పరిశ్రమలో ఈ విషయం చాలా మందికి తెలియదు. పైగా కరోనా వల్ల బయటకు కూడా రాకపోవడంతో ఎవరి కంటికీ ఆమె చిక్కలేదు. తాజాగా ఈ వార్తను ఆర్య సన్నిహితుడు, హీరో విశాల్ బయటపెట్టడంతో అందరికీ తెలిసింది.
అయితే హీరో విశాల్ ఏమన్నారంటే… ‘ఈ వార్తను బ్రేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంకుల్ అయినందుకు ఆనందమేస్తుంది. బ్రో జమ్మీ & సయేషా ఆర్ బ్లెస్డ్ విత్ # బేబీగర్ల్. కంట్రోల్ చేసుకోలేని భావోద్వేగాలు ఇప్పుడు నాలో ఉన్నాయి’ అంటూ విశాల్ ట్వీట్ చేశారు. దీంతో ఆర్య, సయేషా సైగల్ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం బయటకు వచ్చింది. కాగా ఆర్య కొత్త చిత్రం ‘సర్పట్ట పరంపరై’ ఈ మధ్య రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఆర్య, విశాల్ ఇద్దరూ కలిసి ‘ఎనిమీ’ అనే సినిమాలో నటించనున్నారు. ఆర్య, సయేషాను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.