న్యూజిలాండ్ లో భూకంపం.. తీవ్ర హెచ్చరికలు
న్యూజిలాండ్ లో తాజాగా వరస భూకంపాలు సంభవించాయి. రాజధాని ఆక్లాండ్ కు సమీపంలోని సముద్రంలో వరసగా మూడు మార్లు భూకంపాలు ఏర్పడ్డాయి. రిక్టర్ స్కేల్ పై 7.3, 7.4, 8.1గా భూకంప తీవ్రత నమోదైంది.
అయితే వరసగా మూడు సార్లు భూకంపం సంభవించడంతో సముద్రంలో అలజడి మొదలైంది. దీంతో అక్కడి ప్రభుత్వం సునామి హెచ్చరికలను జారీ చేసింది. టోకోమారు బేలో సముద్రంలో సముద్రం ముందుకు వచ్చేసింది. చిన్న చిన్న అలలు ఎగసిపడుతున్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు. కాగా సునామి హెచ్చరికలను జారీ చేసిన బీచ్ ల నుంచి ప్రజలను మరో ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే పోర్ట్ లను తాత్కాలికంగా మూసేస్తున్నారు. మొత్తానికి భూకంపం తీవ్రతను బట్టి న్యూజిల్యాండ్ లో అలజడి అలముకొని ఉంది.