నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా: తాప్సీ
అందాల నటీమణి తాప్సీ వైవిధ్యమైన స్టోరీలను ఎంచుకొంటూ విభిన్నంగా ముందుకు దూసుకుపోతుంది. తాప్సీ సినిమా అంటే ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తుటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తాప్సీ సొంతం. అయితే ముఖ్యంగా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే.
అదేవిధంగా ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్తో హీరోయిన్ తాప్సీ ప్రేమలో పడిందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. కాగా ఇదే విషయంపై రీసెంట్గా తాప్సీ స్పందించింది. ‘మ్యాథ్యూస్ తనకు బాగా తెలిసిన వ్యక్తి.. మంచి సన్నిహితుడు కూడా అని మాత్రమే తెలిపింది. అలాగే.. సినిమా రంగానికి చెందిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది. ఇంకా ఆమె మాట్లాడుతూ మనం ఎదిగే వృత్తి, వ్యక్తిగత జీవితం అనేవి వేర్వేరుగా ఉండాలని తాప్సీ వివరించింది. ఇప్పుడు తాను సంవత్సరానికి ఆరు సినిమాల్లో నటిస్తున్నానని, ఆ సంఖ్య తగ్గితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని తాప్సీ స్పష్టం చేయడం విశేషం.