నేడే ఖమ్మం సాక్షిగా వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఏపీలో గత ఎన్నికల సమయంలో అనేక చోట్ల ముమ్మరంగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించడంతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగా షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా ఈ మధ్య సమావేశాలు నిర్వహించారు. ఏప్రిల్ 9వ తేదీన అంటే ఈరోజు ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారు, అందులో భాగంగానే ఈరోజు ఖమ్మంలో షర్మిల సభను నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ సభకు సంబంధించిన రూట్ మ్యాప్ ను షర్మిల అనుచరుడు పిట్టా రామిరెడ్డి ప్రకటించారు. ఆరోజు ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరి కోటి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేటల మీదుగా వైఎస్ షర్మిల పర్యటన ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా పలువురు గ్రామస్తులు తమ గ్రామం వద్ద ఆగాలని కోరుతున్నారని సమయాన్ని బట్టి చూస్తామని వెల్లడించారు. కోదాడ, నుంచి పాలేరుకు 3.30కి చేరుకుంటారని, పెద్ద తండాలో వైస్సార్ విగ్రహం నుంచి ర్యాలీగా పెవిలియన్ గ్రౌండ్ కి షర్మిల చేరుకుంటారని సమాచారం. మరి ఈ రోజు షర్మిల పార్టీకి సంబంధించిన కీలక విషయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.