నేడు, రేపు బ్యాంకులు బంద్
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈరోజు, రేపు సమ్మె చేయనున్నారు. దీంతో రెండు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
అయితే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం విశేషం. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. తాజాగా బడ్జెట్ సమావేశాల్లో ఐడీబీఐతో పాటు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. కాగా నేడు, రేపు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి.