నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ లో నారప్ప…
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ నటించిన ఆసక్తికరమైన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నారప్ప’. కొన్ని గంటల్లో డిజిటల్ స్క్రీన్లలోకి రానుంది. అయితే ఈ సినిమా జూలై 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజా నివేదికల ప్రకారం జూలై 19వ తేదీనే భారతీయ ప్రేక్షకుల కోసం ‘నారప్ప’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాత్రి 10 గంటల నుండి ప్రసారం చేయనున్నారు. అంటే రిలీజ్ చేస్తామని ప్రకటించిన దానికంటే ముందే అందుబాటులోకి రానుంది అన్నమాట. యుఎస్ఎ ప్రేక్షకుల కోసం ఈ సినిమా ఈరోజు మధ్యాహ్నం 12:30 నుంచి ప్రసారం కానుంది.
కాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’. ఈ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి నేరుగా ఓటిటి ప్లాట్ఫామ్లలో విడుదల కానున్న మొదటి భారీ తెలుగు సినిమా ‘నారప్ప’ కావడం విశేషంగా చెప్పవచ్చు.