నేచర్ తో సంలీనమైన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ…
అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో చెలరేగిపోతుంది. ఈ భామ బాలీవుడ్ లో ఓరేంజ్ లో క్రేజీగా దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య జాన్వీ కపూర్ తన గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది. రంగురంగుల బికినీలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తోంది.
అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే.. జాన్వీ ఫోటోషూట్లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోను చూస్తే… ప్రశాంతమైన సిటీ వెలుతురులను సూర్యాస్తమయంలో తన ఇంటి బాల్కనీలోంచి అల్లా… ఆకాశం వైపు చూస్తూ ఎంతో మైమరచి పోయింది. అదే సమయంలో ఫోటో గ్రాఫర్ అలా వెనకాల నుంచో భలే క్లిక్ మనిపించేశాడు. చల్లటి వెలుతురులోంచి ఎంతో గొప్ప భావాలను నేచర్ చో షేర్ చేసుకుంటున్నట్లుగా అనిపిస్తున్న ఆ తలపును చూసి జాన్వీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అమ్మడు జాన్వి ఏం తీవ్రంగా ఆలోచిస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమ్మర్ కూడా ముగియడంతో జాన్వీ బీచ్ లకు కాస్త విరామం ఇచ్చింది. అయితే ప్రస్తుతం జాన్వీ ‘దోస్తానా 2’ ‘తఖ్త్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.