నెట్టింట్లో అలరిస్తున్న కంగనా.. తలైవి ట్రైలర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టిన రోజున తలైవి సినిమా ట్రైలర్ విడుదలై దుమ్మురేపుతుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పురైచ్చి తలైవి జయలలిత బయోపిక్ గా రూపొందుతోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ బయోపిక్ సినిమా ట్రైలర్ కావడంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
అదేవిధంగా దర్శకుడు విజయ్ జయలలితలోని సినిమా, రాజకీయ కోణాలను చాలా స్పష్టంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ను చూస్తే కంగనా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో జయలలితను మరిపించిందనే చెప్పాలి. ఎం.జి.ఆర్ గా అరవింద స్వామి కూడా పర్ ఫెక్ట్ గా సూటయ్యాడనే అనిపిస్తుంది. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ సినిమాను గ్రాండియర్ గా మెరిపిస్తుంది. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 23న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమౌతుంది.