నీలం సాహ్ని రాజీనామా… ఆ వెంటనే ఆమోదం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్నీ రాజీనామా చేశారు. అయితే నీలంసాహ్నీ రాజీనామాకు వెంటనే ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ ఎస్ఈసీగా తాజాగా నియమితులైన నీలం సాహ్నీ ఈ నెలాఖరున ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను వరుసగా నిర్వహించి ముగించుకున్న ఆయన.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి సమయం సరిపోదని తాను నిర్వహించలేనని తన తర్వాత ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించే వారితో ఎన్నికలు వెళ్తే బాగుంటుందని హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. కాగా.. గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్ అయిన నీలం సాహ్నీని.. ఆ తర్వాత తన ముఖ్య సలహాదారుగా సీఎం వైఎస్ జగన్ నియమించుకున్నారు. ప్రస్తుతం ఆ పదవికి రాజీనామా చేసిన ఆమె.. త్వరలో ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించనుండటం విశేషం.