నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్….

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకే ఉద్యోగుల వయోపరిమితి పెంచుతున్నామని కూడా స్పష్టం చేశారు.
అయితే వయోపరిమితి పెంపు ప్రభావం ఖాళీల భర్తీపై ఎంతమాత్రం పడబోదని స్పష్టం చేశారు. ఉద్యోగుల అనుభవాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుందని తెలిపిన హరీష్రావు వయసు పెరిగే కొద్దీ.. వారు మరింత అనుభవంతో పనిచేస్తారని తెలిపారు. ఉద్యోగుల జీవన ప్రమాణాలు కూడా పెరిగి.. జీవిత కాలం కూడా పెరిగిందని.. ఇది కూడా ఒక కారణంగా చెప్పారు. కాగా అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని.. రాష్ట్రంలో వెంటనే 50 వేల ఖాళీలు భర్తీ చేస్తామని వివరించారు. అలాగే దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని.. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని హరీష్ రావు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *