నిజమైన కోవిడ్ హీరోలు నర్సులు : మెగాస్టార్

ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు నుంచి సామాన్య ప్రజలు వరకు సోషల్ మీడియా ద్వారా నర్సులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నర్సులకు ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
అదేమంటే… “దేశంలోను, ప్రపంచంలోని నర్సులు అందరికీ నా సెల్యూట్. నిజమైన కోవిడ్ విజేతలు నర్సులు. హెల్త్ కేర్ సిస్టంలోనే ప్రధానమైన శాఖ. మీరు ప్రపంచం ఆరోగ్యంగా ఉండడానికి అలసిపోకుండా సేవ చేస్తున్నారు. మీ అందరికీ మరింత శక్తి చేకూరాలి. మీ హీలింగ్ టచ్ కు కృతజ్ఞతలు” అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం దేశం కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఈ సమయంలోనే వైద్యులు, నర్సులు, పోలీసులు తదితర ఫ్రంట్ లైన్ వారియర్స్ ఏమాత్రం రెస్ట్ లేకుండా ప్రజల కోసం సేవ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో “హ్యాపీ నర్సెస్ డే’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.