నా బయోపిక్ ను తీయకండి : ప్రియాంక చోప్రా..!
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి గ్లోబల్ బ్యూటీగా ప్రపంచస్థాయి ఖ్యాతి పొందిన నటీమణి ప్రియాంక చోప్రా. బాలీవుడ్తో పాటు, హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రియాంక మెల్లిమెల్లిగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఎన్నో అవార్దులను సొంతం చేసుకోంది.
అయితే ప్రస్తుతం బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రియాంక చోప్రా జీవితంపై కూడా సినిమా వస్తుందంటూ ఈ మధ్య టాక్ వినిపిస్తోంది. దీంతో తాజాగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. దయచేసి తన బయోపిక్ ను తీయకండి అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తన జీవితంపై అప్పుడే సినిమా తీసేంత సమయం రాలేదని తెలిపింది. తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని.. అప్పుడే తనను బయోపిక్ ల జాబితాలో చేర్చకండి అంటూ వివరించింది. కాగా ప్రియాంక చోప్రా తనకన్నా పదేళ్ల చిన్నవాడైన నిక్ జొనాస్ను వివాహమాడిన విషయం తెలిసిందే. కాగా ఈమధ్యనే ప్రియాంక 39వ పుట్టినరోజు లండన్ లో జరుపుకున్న విషయం తెలిసిందే.