నాపేరు అయాన్…
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మిలిటరీ డ్రెస్ వేసి చెలరేగి నటించిన సినిమా ‘నా పేరు సూర్య’! మిలటరీలోకి వెళ్ళి దేశానికి సేవ చేయాలని తపించే సైనికుడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు బన్నీ. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. అయితే తండ్రి నుంచి ఆ మిలట్రీ ప్రేమను కొడుకు అయాన్ అందిపుచ్చుకున్నట్టుగానే ఉంది.
తాజాగా మిలిట్రీ డ్రస్ వేసి కెమెరా ముందు ఫోజులిచ్చాడు అయాన్. ఓ టాయ్ గన్ పట్టుకొని రఫ్ఫాడించాడు. తల్లి స్నేహారెడ్డి అందులోని ఓ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ… ‘మిలిట్రీ లవ్’ అంటూ కామెంట్ పెట్టారు. కాగా అల్లు అర్జున్ వీరాభిమానులు మాత్రం ఈ జూనియర్ బన్నీ ఫోటోను చూసి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఈ బుల్లి అయాన్… మరే గెటప్ వేస్కాడో చూడాలి.