నాగ్ తో కాజల్ రొమాన్స్
వెండితెర ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తాజాగా కింగ్ నాగార్జున సరసన హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఈ మధ్య ఓ సినిమాను నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా చేసేందుకు ప్రారంభించారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. మార్చి 31 నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. అందులో కాజల్ పాల్గొంటుందని సమాచారం అందుతుంది. ఈ నెల 19న విడుదల కాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మోసగాళ్ళు’లో కాజల్… విష్ణుకు సోదరిగా నటించడం విశేషం.
అదేవిధంగా కాజల్ నటిస్తున్న ‘ఆచార్య’ మే 13వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కాగా నాగార్జున మూవీ ఈ యేడాది చివరిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. మొత్తానికి చూస్తే కాజల్ నటించిన మూడు తెలుగు సినిమాలు ఈ సంవత్సరం విడుదల కానుండటం విశేషం.