నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అతనే…
తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉపఎన్నిక అన్ని పార్టీలకు సవాల్ గా మారిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక, జిహెచ్ఎంసీ పలితాలతో దూకుడు మీద ఉన్న బీజేపీ సాగర్ ఎన్నికకోసం కుస్తీలు పడుతుంది. ప్రస్తుతం గులాబీ పార్టీ కూడా అభ్యర్ది ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతుంది.
అయితే సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్, బీజేపీలకు కాస్త ఇబ్బందిని తెచ్చిపెట్టే అంశంగా మారింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. చివరిరోజైన 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిని ఢీకొనే అభ్యర్థి ఎవరనే విషయంలో అధికార టీఆర్ఎస్ సర్వేలపై సర్వేలు చేయించుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ది ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లుగానే తెలుస్తుంది. తాజాగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది. నోముల భగత్ నే సాగర్ ఉప ఎన్నికల అభ్యర్థి అని దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. కాగా మరి కాసేపట్లో ప్రకటన రానుంది. అంతేకాకుండా సీఎం కెసిఆర్ ను కలిసి బీఫాం తీసుకోనున్నారు భగత్. రేపు ఉదయం భగత్ నామినేషన్ వేయనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.