నాగబాబు న్యూలుక్ తెగ వైరల్ గా మారిన వైనం…
టాలీవుడ్ నటుడు నాగాబాబు అంటే తెలియని వారుండరు. చిరంజీవి తమ్ముడిగా, మంచి నటుడిగా నాగబాబుకు మంచి గుర్తింపు ఉంది. అలాగే… జబర్ధస్త్ షోతో నాగబాబు ఫేట్ మారిపోయింది. ఈ షోకు జడ్జిగా వ్యవహరించిన నాగాబాబు మెల్లమెల్లగా ఇతర కార్యక్రమాలకు కూడా జడ్జిగా ఉంటూ అందరినీ అలరించారు.
అయితే ఇన్నాళ్లు జడ్జిగా అలరించిన నాగబాబు ఇప్పుడు మళ్లీ నటుడిగా అలరించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా నాగాబాబు రఫ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫ్యాన్స్కు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ సినిమా కోసం నాగబాబు ఇలా మారాడో తెలుసుకొనేందుకు అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ పిక్ పై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందడం లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం.