నటి సమీరారెడ్డికి కరోనా…
దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకు 2.50 లక్షలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. దీంతో పేద,ధనిక అన్న తేడా లేకుండా కోరనా బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమే తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. హోం క్వారంటైన్లో ఉన్నాను. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూరా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్గా ధృడంగా ఉండాలి’ అంటూ రాసుకొచ్చింది ఈ నటీమణి.
కాగా తన పిల్లలు హన్స్, నైరాతో కలిసి సంతోషంగా ఉండే సమీరా ఎప్పుడూ అందుకు సంబంధించిన వీడియోలను ప్యాన్స్ తో పంచుకుంటూ వారిని ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు సడన్గా ఆమె కోవిడ్ బారిన పడటంతో ఆందోళనకు గురి కావడం ఫ్యాన్స్ వంతు అయింది. అయితే సమీరా రెడ్డి వ్యాపారవేత్త అక్షయ్ వార్డేను 2014లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సమీరా సినిమాలో కనిపించడం పూర్తిగా ఆపేయడంవిశేషం. సమీరా చివరి సినిమా 2012లో రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’. అందులో సమీరా స్పెషల్ సాంగ్ లో నటించింది.