నటసింహం నందమూరి బాలకృష్ణ

తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి తారకరామారావు తనయుడిగా వారసుడిగా సినీరంగంలలోకి ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. తండ్రికి తగిన కొడుకుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ 1974లో ‘తాతమ్మకల’ సినిమాతో నటుడిగా పరిచయమై నటునిగా 48 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అలాగే హీరోగా 38 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుటికీ ఇంకా స్టార్ హీరోగానే కొనసాగుతూ అదే రేంజ్ లో సినిమాలను చేస్తున్నారు. బాలనటులుగా పరిచయమైన బాలయ్య ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో జీవించే నటనను కనబరిచారు. కేవలం స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఎన్నో రికార్డులను బాలయ్య సొంతం చేసుకున్నాడు. అయితే ‘తాతమ్మ కల’తో మొదటిసారి కెమెరా ముందు నటించిన బాలకృష్ణ, ఆ తర్వాత పదేళ్ళ పాటు తండ్రి యన్టీఆర్ చాటు బిడ్డగానే ఎదిగారు. తండ్రితో కలసి ‘తాతమ్మకల, అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వము, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, రౌడీరాముడు-కొంటె కృష్ణుడు, అనురాగదేవత, సింహం నవ్వింది, శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర’ వంటి సినిమాల్లో నటించారు మెప్పించారు బాలయ్య.
అయితే యన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1984లో సోలో హీరోగా బాలకృష్ణ అడుగు పెట్టారు. తొలుతగా ‘సాహసమే జీవితం, డిస్కోకింగ్, జననీ జన్మభూమి’ వంటి సినిమాలు వరుసగా అపజయాలను ఇచ్చాయి. దాంతో అంతా బాలయ్య ఇక కష్టమే అనుకున్నారు అంతా. ఆ తర్వాత ఆయన నటించిన నాల్గవ సినిమా ‘మంగమ్మగారి మనవడు’ సంచలన విజయం సాధించి ఆ సమయంలో పోటీగా ఉన్న సనిమాలపై విజయం సాధించింది. ఇక ఆ తర్వాత నుంచి బాలయ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అదేవిధంగా ‘మంగమ్మగారి మనవడు’ ఘనవిజయం తర్వాత బాలయ్య ఫ్యాన్స్ లో సంతోషం వెల్లువిరిసింది. అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సినిమా హైదరాబాద్ లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన రికార్డుగా ఇప్పటికీ నిలచే ఉంది. అలాగే 1986లో వరసుగా ‘ముద్దుల క్రిష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు’ సినిమాలతో వరుస విజయాలు చూశారు బాలకృష్ణ. ఆ సంవంత్సరం ఏకంగా బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకోవడంతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి బాలకృష్ణ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే టాక్ వచ్చింది.
అంతేకాకుండా ఈ తరం టాప్ స్టార్స్ అందరికంటే… పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రకాల్లో నటించి మెప్పించిన ఘనత బాలకృష్ణకే దక్కుతుంది. అసలు తెలుగు సినీ చరిత్రలోనే ఎన్టీఆర్ తర్వాత అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన హీరోగా కూడా బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. ‘మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్’ చిత్రాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం ఎంతైనా వేశేషంగా చెప్పవచ్చు. అలాగే వాటిలో ‘మంగమ్మగారి మనవడు, లెజెండ్’ సినిమాలు ప్లాటినమ్ జూబ్లీ జరుపుకోవడం అరుదైన ఘనతగా చెప్పువచ్చు. అంతటితో ఆగకుండా హైదరాబాద్ లో అత్యధికంగా 565 రోజులు ప్రదర్శితమైన ఏకైక తెలుగు సినిమా ఇప్పటికీ ‘మంగమ్మగారి మనవడు’. కొసమెరుపు ఏమిటంటే… సౌతిండియాలో ఏకంగా 1116 రోజులు ఆడిన ఏకైక సినిమాగా ‘లెజెండ్’ చరిత్ర సృష్టించడం నటసింహంకు దక్కిన అరుదైన అదృష్టం. మొత్తానికి ఇంతటి ఘన విజయాలు సాధించిన చరిత్ర ఆయనది. ఇంకా ముందు ముందు మరెన్నో విజయాలతో దూసుకుపోవాలని బాలృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు.
Type a message

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *