నకిలీ పౌండేషన్ పై సోనూసూద్ వార్నింగ్…

కరోనా కాలంలో తీరిక లేకుండా ఎక్కడ ఎవరూ ఆపదలో ఉండి ఆదుకోమన్నా వెంటనే వారికి తగిన సాయం అందిస్తున్నారు నటుడు, మానవతా మూర్తి సోనూసూద్. మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా పేదల పాలిట దైవంగా మారాడు. ఆయన సేవలకు గాను దేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సాయం అంటే అక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు.
అయితే సోనూ ఫౌండేషన్ ద్వారా కష్టం అన్నవారికి సాయం చేస్తున్నాడు ఈ రియల్ హీరో. అయితే సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట పలు నకిలీ లింకులు చక్కర్లు కొడుతున్నాయి. సోనూ సూద్ ఫౌండేషన్ అంటూ తమ నంబర్లు ఇచ్చి విరాళాలను పంపించమని అడుగుతున్నారు కేటుగాళ్లు. కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూ.. దీని గురించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇలాంటి నకిలీ ట్వీట్లు, వెబ్ లింకులు, ఫోన్ నంబర్లను నమ్మొద్దని.. ఇవి ఫేక్ అని పేర్కొన్నాడు. నకిలీరాయుళ్లను హెచ్చరిస్తూ సోనూ ‘వార్నింగ్’ అనే క్యాప్షన్ ఇవ్వడం విశేషం.