ధనుష్ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా ట్రైల్స్…

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు టాలీవుడ్ లో అంతగా క్రేజ్ లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సూర్య, కార్తీకి తొలినుంచి ఇక్కడ అభిమానులు విపరీతంగా ఉన్నారు. దీంతో వారి సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతుంటాయి. వాటితో పాటే ధనుష్ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయినా ‘రఘువరన్ బి.టెక్’ మాత్రమే ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ధనుష్ తో పాన్ ఇండియా మూవీ తీస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని తెలుగు నిర్మాతలు ఈ మధ్య తెగ ఆరాటపడుతున్నారు. ఇప్పటికే హిందీతో పాటు ఇంగ్లీష్ మూవీస్ కూడా చేస్తున్న ధనుష్ టాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో భాగంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణదాస్ నారంగ్, పి. రామమోహనరావు నిర్మించే సినిమాలో నటించబోతున్నాడు. ఎప్పుడైతే ధనుష్ స్ట్రయిట్ తెలుగు సినిమాకు పచ్చజెండా ఊపాడో మరికొంతమంది నిర్మాతలు రంగంలోకి దిగారు. ముఖ్యంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ… ధనుష్ తో తెలుగులో ఓ సినిమాను నిర్మించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రపోజల్ ను ధనుష్ ముందు పెట్టారని, అతను తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమచారం. ఇక ధనుష్ ఈ ప్రాజెక్ట్ కు ఓకే అంటే టాలీవుడ్ లో కూడా ఈ స్టార్ కి మంచి క్రేజ్ వచ్చేసినట్లే… చూద్దాం ఏం జరుగుతుందో.